India: భారత్‌ను కాదని.. చైనా సాయం తీసుకున్న నేపాల్!
- ఇప్పటివరకు భారతీయ కంపెనీలపైనే ఆధారపడిన నేపాల్
- 50 కిలోమీటర్ల మేర నిర్మించిన నెట్వర్క్ ప్రారంభం
- ఇప్పుడు మాకు ప్రత్యామ్నాయం లభించింది: నేపాల్
నేపాల్ ఇప్పటివరకు భారతీయ కంపెనీలైన భారతీ ఎయిర్టెల్, టాటా కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యాన్ని పొందుతోంది. అయితే, ఈ విషయంలో ఇప్పుడు చైనా సాయం తీసుకుంటోంది. ఇందులో భాగంగా 50 కిలోమీటర్ల మేర నిర్మించిన నెట్‌వర్క్‌ను ఈ రోజు ప్రారంభించినట్లు ఆ దేశం అధికారికంగా ప్రకటించింది.
భారత్ నుంచి అందుతోన్న ఇంటర్నెట్ సేవల్లో తరుచూ అంతరాయం ఏర్పడుతోందని, ఇప్పుడు తమకు చైనా ద్వారా ప్రత్యామ్నాయం లభించిందని నేపాల్ తెలిపింది. నేపాల్‌లో ప్రస్తుతం 60 శాతం మంది ఇంటర్నెట్ సర్వీసులు పొందుతున్నారు. ఇంటర్నెట్ విషయంలో చైనాతో నేపాల్ చేతులు కలపడంతో ఏళ్ల తరబడి ఆ దేశానికి భారత్ అందిస్తోన్న సేవలు ఇక తగ్గిపోనున్నాయి.