gold: వరుసగా మూడో రోజు పెరిగిన బంగారం ధర!
- ఈ రోజు రూ.100 పెరిగిన బంగారం ధర
- 10 గ్రాముల బంగారం ధర 30,750 రూపాయలుగా నమోదు
- వెండి ధర రూ.100 పెరిగి, కిలోకి రూ.39,900గా నమోదు
డాలర్ విలువ పడిపోవడం, వ్యాపారుల నుంచి డిమాండ్ పెరుగుతుండడంతో బులియన్ మార్కెట్లో బంగారం ధరలు పైపైకి ఎగుస్తున్నాయి. వరుసగా మూడో రోజు పసిడి ధరలు పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి 30,750 రూపాయలుగా నమోదైంది.
పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో వెండి కూడా పసిడి బాటలోనే పయనిస్తూ ధర రూ.100 పెరిగి, కిలో వెండి 39,900 రూపాయలుగా నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఒక్కో ఔన్స్ 1.17 శాతం పెరిగి 1,337.40 డాలర్లుగా నమోదైంది.