Supreme Court: సుప్రీంకోర్టు నలుగురు న్యాయమూర్తుల వ్యాఖ్యలకు సంబంధించి.. బార్ అసోసియేషన్ కీలక తీర్మానాలు!
- సీజేఐతో సీనియర్ జడ్జిలకు ఉన్న విభేదాలను సుప్రీంకోర్టు పూర్తిస్థాయి ధర్మాసనం పరిశీలించాలి
- అన్ని పిల్‌లను ప్రధాన న్యాయమూర్తి లేక కొలీజియంలోని న్యాయమూర్తులు పరిశీలించాలి
- ఈ నెల 15 కోసం లిస్ట్ చేసిన పిల్‌లను వేర్వేరు బెంచ్‌ల నుంచి కొలీజియం సభ్యులైన జడ్జిల బెంచ్‌కు బదిలీ చేయాలి
దేశ అత్యున్నత న్యాయస్థానంలో పరిస్థితులు సజావుగా లేవని, ఎన్నో అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఇటీవల మీడియా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా న్యాయమూర్తులు మీడియా ముందుకు రావడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై ఈ రోజు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సమావేశమై నలుగురు న్యాయమూర్తుల వ్యాఖ్యలకు సంబంధించి కీలక తీర్మానాలకు ఆమోదం తెలిపింది. అవి..
- సీజేఐతో సీనియర్ జడ్జిలకు ఉన్న విభేదాలను సుప్రీంకోర్టు పూర్తిస్థాయి ధర్మాసనం పరిశీలించాలి
- అన్ని పిల్‌లను ప్రధాన న్యాయమూర్తి లేక కొలీజియంలోని న్యాయమూర్తులు పరిశీలించాలి
- ఈ నెల 15 కోసం లిస్ట్ చేసిన పిల్‌లను వేర్వేరు బెంచ్‌ల నుంచి కొలీజియం సభ్యులైన జడ్జిల బెంచ్‌కు బదిలీ చేయాలి
ఈ విషయాలపై అవసరమైతే తాము ప్రధాన న్యాయమూర్తితో పాటు ఇతర జడ్జిలతో చర్చించేందుకు సిద్ధమని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రకటించింది. నలుగురు న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలపై ఏ రాజకీయ పార్టీ గానీ, రాజకీయ నాయకులు గానీ మితిమీరి వ్యాఖ్యలు చేయకూడదని సూచించింది.