China: ఇల్లు కాలిపోతే సెల్ఫీలు దిగుతూ పోస్టులు పెట్టిన జంట!
- ముఖంలో చిరునవ్వును పోనీయని చైనా జంట
- అదే సానుకుల స్వభావానికి నిదర్శనమని క్యాప్షన్
- వీడియో తీసి మరీ వివరణ
ఓ వైపు ఇల్లు తగలబడి సామాన్లు కాలిపోయిన వేళ, ఏ మాత్రం ముఖంలో నవ్వును పోనీయకుండా, వీడియోలు తీస్తూ, సెల్ఫీలు దిగుతూ, ఆ వెంటనే వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ, తాము సానుకూల స్వభావానికి నిదర్శనమని క్యాప్షన్లు పెట్టిందో జంట. ఈ ఘటన చైనాలోని నానింగ్ ప్రాంతంలో జరిగింది. "నేను ఆ సమయంలో బాత్ రూములో ఉన్నాను. ఏదో కాలుతున్న వాసన వచ్చింది. డోర్ తీసి చూస్తే మంటలు కనిపించాయి. వస్తువులన్నీ కాలిపోతున్నాయని తెలిసింది.
వెంటనే వెళ్లి నా గర్ల్ ఫ్రెండ్ ను నిద్రలేపా. ఇద్దరమూ కలసి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాం. ఇరుగు, పొరుగు వచ్చి సాయం చేశారు" అంటూ జాంగ్ చెంగ్ అనే వ్యక్తి తీసుకున్న సెల్ఫీ వీడియో ఇప్పుడు వైరల్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఆ రోజే వారు ఇంట్లో బర్త్ డే వేడుకలు జరుపుకున్నారట. మంటలు ఆరిపోయిన తరువాత, ఇల్లు శుభ్రం చేసే పనిని కూడా పక్కన బెట్టిన ఈ జంట, సెల్ఫీలు దిగుతూ, నష్టాన్ని చూసి తాము కుంగిపోవడం లేదని క్యాప్షన్లు పెడుతూ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తుండటం గమనార్హం.