BIPIN RAWAT: పాకిస్థాన్ కు దడ పుట్టించాలి: ఆర్మీ చీఫ్

  • కశ్మీర్ విషయంలో రాజకీయ కార్యాచరణ అవసరం
  • పాక్ వెన్నులో వణుకు పుట్టించాలి
  • పొలిటికో-మిలిటరీ వైఖరిని అవలంబించాలి

జమ్ముకశ్మీర్ లో శాంతి నెలకొనాలంటే రాజకీయపరమైన కార్యాచరణ అవసరమని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ అన్నారు. కశ్మీర్ లో ఉగ్రవాద చర్యలను నిలిపివేసేలా పాకిస్థాన్ పై సైనిక చర్యలను పెంచాలని చెప్పారు. సైనిక బలగాలు కొత్త వ్యూహాలను అమలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. సరిహద్దుకు అవతల ఉగ్రవాద కార్యకలాపాలను నిలిపివేసేలా... పాకిస్థాన్ కు దడ పుట్టించాలని చెప్పారు. దానికి పొలిటికో-మిలిటరీ వైఖరిని మనం అనుసరించాల్సి ఉంటుందని అన్నారు.

రాజకీయ కార్యాచరణకు ఇతర కార్యాచరణలు తోడైతే కశ్మీర్ లో శాంతి నెలకొంటుందని చెప్పారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించే ప్రయత్నంలో మిలిటరీ ఒక భాగం మాత్రమేనని అన్నారు. ఉగ్రవాదులు, తీవ్రవాదుల పని పట్టడం... వారి పట్ల ఆకర్షితులయ్యేవారి సంఖ్య పెరగకుండా చూడటమే తమ పని అని చెప్పారు.

  • Loading...

More Telugu News