delhi: కుక్కకు టికెట్ తీసుకోలేదని.. రూ.27.30 జీఎస్టీతో కలిపి రూ.575 జరిమానా!
- కుక్కపిల్లను రూ.33,000కు కొనుక్కున్న హైదరాబాద్ వ్యాపారి
- దాన్ని అందించేందుకు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైల్లో యువకుడి ప్రయాణం
- ఆగ్రాలో పట్టుకుని ఫైన్ వసూలు చేసిన రైల్వే సిబ్బంది
ఓ యువకుడు నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ప్రయాణిస్తున్నాడు. తనతో పాటు బుల్లీ జాతికి చెందిన కుక్కపిల్లను తీసుకెళుతున్నాడు. అయితే, ఆగ్రాలో రైల్వే అధికారులు అతన్ని పట్టుకుని, కుక్కకు టికెట్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. దానికి టికెట్ తీసుకోని కారణంగా రూ.27.30 జీఎస్టీతో కలిపి రూ.575 జరిమానా విధించి పంపారు. కుక్కకి కూడా టికెట్ తీసుకోవాలని తెలియక ఆ యువకుడు తన ఒక్కడికే టికెట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌కి చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆ కుక్కపిల్లను రూ.33,000కు కొన్నాడని, అతనికి దానిని ఇవ్వడానికి తాను రైల్లో ప్రయాణిస్తున్నానని ఆ యువకుడు చెప్పాడు. ఆ యువకుడు పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి అని తెలిసింది.