North Korea: కొరియన్ ద్వీపకల్పం చుట్టూ అమెరికా స్టెల్త్ బాంబర్స్తో మోహరింపు
- వచ్చే నెలలో కొరియాలో వింటర్ ఒలింపిక్స్
- భద్రతపరమైన చర్యల్లో భాగంగానే తరలిస్తున్నామంటోన్న అమెరికా
- ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, నేలమీద, నీటిమీద పోరాడగల షిప్ తరలింపు
వచ్చే నెలలో దక్షిణ కొరియాలో వింటర్ ఒలింపిక్స్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా, దక్షిణ కొరియా చర్చలు కూడా జరుపుతున్నాయి. కాగా, కొరియన్ ద్వీపకల్పం చుట్టూ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, నేలమీద, నీటిమీద పోరాడగల షిప్ను తీసుకొస్తోంది. ఈ విషయంపై అమెరికా మిలటరీ అధికారులు మాట్లాడుతూ... తాము కేవలం భద్రతపరమైన చర్యల్లో భాగంగానే స్టెల్త్ బాంబర్స్ ను అక్కడికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు. కాగా, గతంలో ఉత్తరకొరియా దుందుడుకు చర్యలకు పాల్పడినప్పుడు అమెరికా ఉత్తరకొరియా వైపునకు యుద్ధ నౌకను తరలించడం అలజడి రేపిన విషయం తెలిసిందే.