justice: జ‌స్టిస్ లోయా మృతిపై అన్ని విష‌యాలు పిటిష‌న‌ర్ల‌కు తెలియాలి: సుప్రీం

  • మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆదేశం
  • అంగీక‌రించిన ప్ర‌భుత్వ త‌ర‌ఫు న్యాయ‌వాది హరీశ్ సాల్వే
  • లోయా అనుమానాస్ప‌ద మృతిపై సుప్రీంకోర్టు విచార‌ణ‌

జ‌స్టిస్ బీఎం లోయా అనుమానాస్ప‌ద మృతికి సంబంధించి జ‌ర్న‌లిస్ట్ బంధురాజ్ శంభాజీ, రాజ‌కీయ ఉద్య‌మ‌కారుడు తెహ‌సీన్ పూనావాలాలు దాఖ‌లు చేసిన ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యాల‌పై సుప్రీంకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని ర‌కాల వివ‌రాలను పిటిష‌నర్ల‌కు తెలియ‌జేయాల‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. ఈ మేర‌కు వైద్య నివేదిక‌తో పాటు ప్రామాణిక డాక్యుమెంట్ల కాపీల‌ను వారికి అంద‌జేయాల‌ని తెలిపింది.

సుప్రీం ఆదేశాల‌కు మహారాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే అంగీక‌రించారు. అన్ని డాక్యుమెంట్లను పిటిషనర్లకు అందజేయడానికి అభ్యంతరం లేదని, అయితే, పిటిషనర్లు ఆ డాక్యుమెంట్లను బహిరంగపరచకూడదని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశించిన విధంగా అన్ని డాక్యుమెంట్లను సీల్డ్ కవర్‌లో పెట్టి సుప్రీంకోర్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సమర్పించింది.

  • Loading...

More Telugu News