dogs: పెంపుడు కుక్కల అరుపులను డీకోడ్ చేసే ప్రయత్నం.. త్వరలోనే ట్రాన్స్ లేటర్!
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో అభివృద్ధి
- అరుపులు, భావాలను ఇంగ్లిష్‌లోకి మార్చేందుకు యంత్రం
- పదేళ్లలో అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పెంపుడు కుక్కల అరుపును మానవ భాషలోకి మార్చే యంత్రాన్ని అభివృద్ధి చేసేందుకు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. దాదాపు 30 ఏళ్ల నుంచి యానిమల్ బిహేవియర్ మీద పరిశోధన చేస్తున్న కాన్ స్లోబోడ్షికాఫ్ ఈ యంత్రానికి పెట్ ట్రాన్స్‌లేటర్ అని పేరు పెట్టారు. పెంపుడు కుక్కల అరుపులు, భావాలను ఇంగ్లిష్‌లోకి అనువదించేలా ఈ ట్రాన్స్‌లేటర్‌ను తయారుచేయబోతున్నారు.
పెంపుడు జంతువులకు, మనుషులకు మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ ట్రాన్స్‌లేటర్ మరింత దృఢపరచనుందని కాన్ అన్నారు. వచ్చే పదేళ్లలో ఈ యంత్రాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం నార్త్ రెన్ అరిజోనా యూనివర్సిటీలో పనిచేస్తున్న కాన్ స్లోబోడ్షికాఫ్ ప్రయరీ శునకాల సమాచార సరఫరా మీద అధ్యయనం చేస్తున్నారు. వాటి అరుపుల ఆధారంగా ఆయనతో పాటు కొంతమంది శాస్త్రవేత్తలు ఓ అల్గారిథమ్ని రూపొందించారు. దీని ఆధారంగానే పెట్ ట్రాన్స్‌లేటర్ పనిచేయనుంది.