India: టీమిండియా లక్ష్యం 287 పరుగులు.. ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయిన భారత్!
- మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 335, రెండో ఇన్సింగ్స్‌లో 258 పరుగులు
- మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 307 పరుగులు
- రెండో ఇన్సింగ్స్‌లోనూ టాప్ ఆర్డర్ వైఫల్యం
- మురళీ విజయ్, లోకేశ్ రాహుల్, కోహ్లీ ఔట్
సెంచూరియన్‌లో జరుగుతోన్న భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 258 పరుగులకు ఆలౌట్ అయింది. మార్కమ్ 1, ఆమ్లా 1, డివిల్లియర్స్ 80, ఎల్గర్ 61, డికాక్ 12, ఫిలాండర్ 26, కేశవ్ మహరాజ్ 6, డుప్లెసిస్ 48, రబాడా 4, మార్కెల్ 10 (నాటౌట్), ఎన్గిడీ 1 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికాకి 8 పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో లభించాయి. భారత బౌలర్లతో షమీ 4 వికెట్లు తీయగా, జస్ప్రిత్ బుమ్రా 3, ఇషాంత్ శర్మ 2, రవిచంద్రన్ అశ్విన్ 1 వికెట్ తీశారు.
మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా 335 పరుగులు చేసి ఆలౌట్ కాగా, భారత్ 307 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా రెండో ఇన్సింగ్స్ లో 258 పరుగులు చేయడంతో భారత్ ముందు 287 పరుగుల లక్ష్యం ఉంది. లక్ష్య ఛేదనలో బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. మురళీ విజయ్ 9 పరుగుల వ్యక్తిగత స్కోరుకి రబాడా బౌలింగ్‌లో అవుట్ కాగా, లోకేశ్ రాహుల్ 4 పరుగులు చేసి ఎన్గిడీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అనంతరం కొద్ది సేపటికే 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో పుజారా 7, పార్థివ్ పటేల్ 0 పరుగులతో ఉన్నారు. టీమిండియా స్కోరు 26/3 (17ఓవర్లకి) గా ఉంది.