Elephants: వామ్మో! వైజాగ్ జూ ఏనుగులు... రోజుకు ఎంత తింటాయో తెలిస్తే అవాక్కే!
- రోజుకు దాదాపు టన్ను ఫుడ్డు
- ఔరంగాబాద్ నుంచి వచ్చిన సరస్వతి, లక్ష్మి
- సందర్శకులను అలరిస్తున్న ఏనుగులు
తల్లి ఏనుగు సరస్వతి, దానికి పుట్టిన బిడ్డ లక్ష్మి... ఈ రెండు ఏనుగులూ ఔరంగాబాద్ నుంచి విశాఖపట్నం జూకు ఇటీవలే వచ్చాయి. ఇక్కడి మావటిలకు అలవాటు పడుతున్నాయి. సరస్వతి చెప్పినట్టు వింటుండగా, లక్ష్మి మాత్రం కాస్తంత మారాం చేస్తోంది. ఇక ఇవి రోజుకు ఎంత ఆహారాన్ని తీసుకుంటాయో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే.
రోజుకు ఈ తల్లీ కూతుళ్లు కలసి 650 కిలోల పచ్చగడ్డి, 20 కిలోల కేటిల్ ఫీడ్, పది కిలోల రాగితోఫ, 5 కిలోల చొప్పున అన్నం బెల్లం, కొమ్ము శనగలు, పది కొబ్బరి కాయలు, 75 కిలోల చెరకు, 5 పుచ్చకాయలు, 5 అరటి గెలలు, వంద కిలోల అరటి దువ్వ, 50 కిలోల మర్రి, రావి ఆకులను లాగించేస్తున్నాయి. వీటితో పాటు మరో రెండు ఏనుగులు లక్ష్మి, కృష్ణ, రాజా కూడా విశాఖ జూలో సందర్శకులను అలరిస్తున్నాయి.