India: దక్షిణాఫ్రికా క్రికెటర్లకు జరిమానా!
- సెంచూరియన్ వేదికగా ఈ రోజు ముగిసిన రెండో టెస్టు
- స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా
- రెండో మ్యాచ్ ఫీజులో కెప్టెన్‌కి 40 శాతం కోత
- మిగతా ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 20 శాతం చొప్పున జరిమానా
సెంచూరియన్ వేదికగా ఈ రోజు జరిగిన భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టులో సౌతాఫ్రికా ఘన విజయం సాధించి ఒక టెస్ట్ మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, స్లో ఓవర్ రేట్ కారణంగా దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు ఐసీసీ జరిమానా విధించింది. సౌతాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్‌కి రెండో మ్యాచ్ ఫీజ్‌లో 40 శాతం కోత విధించగా, జట్టులోని ఇతర ఆటగాళ్లకు 20 శాతం చొప్పున ఫీజు కోతను విధించారు. కాగా, ఈ నెల 24 నుంచి దక్షిణాఫ్రికాలోని జోహెన్స్ బెర్గ్ లో చివరి టెస్టు ప్రారంభం కానుంది.