Andhra Pradesh: విశాఖ ఏజెన్సీలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
- చలికి వణకుతున్న ఏజెన్సీ వాసులు
- లంబసింగిలో 4 , చింతపల్లిలో 4.5 డిగ్రీల ఉష్ణోగ్రత
- పొగమంచు కారణంగా వాహనాలు ముందుకు వెళ్లలేని పరిస్థితి
విశాఖ ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. లంబసింగిలో 4 డిగ్రీలు, చింతపల్లిలో 4.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీనికితోడు పొగ మంచు దట్టంగా పడుతోంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అక్కడి ప్రజలు చలికి తట్టుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా, వృద్ధులు, చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పొగమంచు కారణంగా వాహనాలు ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. రహదారులు పొగమంచుతో కప్పేయడంతో పట్టపగలే వాహనాల లైట్లు వేసుకుని జాగ్రత్తగా ముందుకు వెళ్లాల్సి వస్తోందని స్థానికులు చెబుతున్నారు.