USA: హఫీజ్ సయీద్ ను ఉరి తీయాల్సిందే: పాక్ కు అమెరికా హెచ్చరిక!

  • హఫీజ్ పై ఏ కేసూ లేదన్న పాక్ ప్రధాని
  • స్పందిస్తూ మండిపడ్డ అమెరికా 
  • అతన్ని చట్టం ముందు నిలపాల్సిందే
  • అత్యంత కఠిన శిక్ష పడాల్సిందేనన్న హెదర్ న్యువార్ట్

ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్రవేసిన హఫీజ్ సయీద్ ను చట్టం ముందు నిలబెట్టి ఉరితీయాల్సిందేనని అమెరికా వ్యాఖ్యానించింది. హఫీజ్ పై ఎలాంటి కేసూ తమ దేశంలో నమోదు కాలేదని, ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం లేదని పాక్ ప్రధాని షాహిద్ కఖాన్ అబ్బాసీ వ్యాఖ్యానించిన 24 గంటల తరువాత అమెరికా తీవ్రంగా మండిపడుతూ, పాక్ కు హెచ్చరికలు జారీ చేసింది. హఫీజ్ సయీద్ ఉగ్రవాదేనని, గతంలో తమకు హామీ ఇచ్చినట్టుగా ఆయన్ను చట్టం ముందు నిలబెట్టి శిక్షించాల్సిందేనని యూఎస్ ప్రతినిధి హెదర్ న్యువార్ట్ వ్యాఖ్యానించారు.

"యూఎన్ఎస్సీ 1267 ప్రకారం హఫీజ్ ఉగ్రవాది. ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన లష్కరే తోయిబాకు అధినేత. ఎల్ఈటీని విదేశీ ఉగ్ర సంస్థగా మేము గుర్తించాం. ఎన్నో దేశాలు కూడా గుర్తించాయి. చట్టప్రకారం అతన్ని శిక్షించాల్సిందే" అని న్యువార్ట్ మీడియాకు తెలిపారు. ఈ విషయంలో అమెరికా వైఖరిని ఇప్పటికే స్పష్టంగా చెప్పామని, ఈ వ్యక్తికి అత్యంత కఠినశిక్ష అమలవుతుందనే భావిస్తున్నామని అన్నారు. అమెరికన్లు సహా ఎంతో మందిని పొట్టన బెట్టుకున్న 2008 ముంబై ఉగ్ర దాడుల వెనుక మాస్టర్ మైండ్ ఇతనేనని గుర్తు చేశారు. పాకిస్థాన్ లోని 'జియో టీవీ'లో మాట్లాడుతూ ప్రధాని అబ్బాసీ, హఫీజ్ ను 'సాహెబ్'గా అభివర్ణించడాన్ని ఆయన తప్పుబట్టారు.

  • Loading...

More Telugu News