aap: 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై వేటు వేయండి: కేంద్ర ఎన్నికల సంఘం.. కేజ్రీవాల్ కు షాక్

  • పార్లమెంటు సెక్రటరీలుగా కొనసాగుతున్న ఎమ్మెల్యేలు
  • లాభదాయక పదవుల్లో ఉన్నారన్న ఈసీ
  • అనర్హత వేటు వేయాలంటూ రాష్ట్రపతికి సిఫారసు

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఆప్ కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ఈసీ పేర్కొంది. వీరిని అనర్హులుగా ప్రకటించాలంటూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు సిఫారసు చేసింది. వీరంతా పార్లమెంటు సెక్రటరీలుగా లాభదాయక పదవుల్లో కొనసాగుతున్నారని తెలిపింది.

ఒకవేళ ఈ 20 మందిని రాష్ట్రపతి అనర్హులుగా ప్రకటిస్తే... ఈ స్థానాలకు ఉపఎన్నిక జరుగుతుంది. 70 మంది ఎమ్మెల్యేలు ఉండే ఢిల్లీ అసెంబ్లీలో 66 మంది ఆప్ కు చెందినవారే ఉన్నారు. దీంతో వీరిపై అనర్హత వేటు పడ్డా కేజ్రీ ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు. కాకపోతే, పార్టీకి మాత్రం పెద్ద దెబ్బ తగిలినట్టే. 2015లో ఆప్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 21మందిని పార్లమెంటు సెక్రటరీలుగా కేజ్రీవాల్ నియమించారు. మరోవైపు ఈసీ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆప్ ఆశ్రయించనుంది. 

  • Loading...

More Telugu News