paruchuri: ’క్లైమాక్స్’ ఎలా ఉండాలనే విషయాన్ని ఆయన దగ్గర నేర్చుకున్నాం: పరుచూరి గోపాలకృష్ణ
- నాటి దర్శకుడు హనుమాన్ ప్రసాద్ అద్భుతమైన మాట చెప్పారు
- ‘సినిమా’ పంచభక్ష్య పరమాన్నం అయితే ‘క్లైమాక్స్’ అనేది కిళ్లీ
- సినిమా అంతా బాగున్నా..క్లైమాక్స్ నచ్చకపోతే భరించలేం
- ‘పరుచూరి పలుకులు’ లో గోపాలకృష్ణ
’కలియుగ మహాభారతం’, ‘ఛాయ’ చిత్రాలకు దర్శకత్వం వహించిన హనుమాన్ ప్రసాద్ తమకు చెప్పిన విషయాలను ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు. ‘పరుచూరి పలుకులు’లో గోపాలకృష్ణ మాట్లాడుతూ, హనుమాన్ ప్రసాద్ గారు ఓ అద్భుతమైన మాట చెప్పారు.
అదేమిటంటే..‘‘సినిమా’ పంచభక్ష్య పరమాన్నం అయితే, ‘క్లైమాక్స్’ అనేది కిళ్లీ’ అని చెప్పారు. అంటే, కడుపు నిండా పంచభక్ష్య పరమాన్నం తిన్నా కూడా.. ఆ తర్వాత వేసుకునే కిళ్లీలో సున్నం ఎక్కువైతే ఏం చేస్తాం ఊసేస్తాం. అలాగే, సినిమా అంతా బాగున్నా..క్లైమాక్స్ నచ్చకపోతే భరించలేం. సినిమా క్లైమాక్స్ ఎలా ఉండాలనే విషయాన్ని ఆయన దగ్గర నుంచి మేము నేర్చుకున్నాం’ అని చెప్పుకొచ్చారు.