earth: భూమి ఏర్పడ్డప్పటి నుంచి మనిషి ఉన్నాడు.. కేంద్ర మంత్రి విచిత్ర వ్యాఖ్యలు
- విమానాన్ని భారతీయులే కనుక్కున్నారని గతంలో సత్యపాల్ సింగ్ వ్యాఖ్యలు
- తాజాగా డార్విన్ సిద్ధాంతం పూర్తిగా తప్పని వ్యాఖ్య
- మన పురాతన గ్రంథాల్లో అటువంటి విషయం లేదు
కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గతంలో విమానాన్ని భారతీయులే కనుక్కున్నారని, అదే విషయాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాల్సి ఉందని ఆయన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఛార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన జీవపరిణామక్రమ సిద్ధాంతాన్ని తప్పుపట్టారు. డార్విన్ సిద్ధాంతం పూర్తిగా తప్పని అన్నారు. డార్విన్ సిద్ధాంతాన్ని కాలేజీ, స్కూల్స్ లో బోధించ కూడదని అన్నారు. డార్విన్ సిద్ధాంతం ప్రతిపాదించిన విధంగా మానవ పరిణామ క్రమం గురించి మన పురాతన గ్రంథాల్లో లేదని, అంతేగాక డార్విన్ జీవపరిణామక్రమ సిద్ధాంతం శాస్త్రీయంగానూ నిరూపితం కాలేదని పేర్కొన్నారు. అసలు భూమి ఏర్పడ్డప్పటి నుంచి మనిషి ఉన్నాడని అన్నారు.