Prakash Raj: కేంద్ర మంత్రికి చురకలంటించిన ప్రకాశ్ రాజ్!
- జీవ పరిణామక్రమ సిద్ధాంతం తప్పని సత్యపాల్ సింగ్ వ్యాఖ్యలు
- కోతి నుంచి మనిషి పుట్టాడన్న విషయాన్ని మన పూర్వీకులు చూడలేదని ఆయన అన్నారు: ప్రకాశ్ రాజ్
- అందుకు భిన్నమైన పరిస్థితులను మనం ఇప్పుడు చూస్తున్నాం
- మనుషులు మళ్లీ రాతి యుగం కాలం నాటికి తీసుకెళ్తున్నారు
ఛార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామక్రమ సిద్ధాంతం తప్పని, మన పురాణాలు అలా చెప్పలేదని, డార్విన్ సిద్ధాంతాన్ని కాలేజీలు, స్కూల్స్లో బోధించకూడదని కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ రెండు రోజుల క్రితం విచిత్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలుసార్లు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన సినీ నటుడు ప్రకాశ్ రాజ్.. సత్యపాల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కూడా విరుచుకుపడ్డారు.
మనిషి కోతి నుంచి పుట్టాడన్న విషయాన్ని మన పూర్వీకులు చూడలేదని మంత్రిగారు అంటున్నారని, అయితే, ఇప్పుడు మళ్లీ కొన్ని భిన్నమైన పరిస్థితులను మాత్రం మనం చూస్తున్నామన్న విషయాన్ని మీరు అంగీకరించకుండా ఉండగలరా? అని ప్రశ్నించారు. అంటే మానవుడు ప్రస్తుతం కోతిలాగా మారి గతాన్ని తవ్వుతూ మళ్లీ రాతి యుగం కాలం నాటికి తీసుకెళ్తున్నాడని ట్వీట్ చేసి చురకలంటించారు.