Andhra Pradesh: ఏపీ సీఎస్‌, డీజీపీపై హైకోర్టు ఆగ్ర‌హం.. ఈ నెల 27న కోర్టులో హాజరు కావాలని ఆదేశం

  • ఇటీవల జోరుగా కొనసాగిన కోడిపందేలు
  • ఈ రోజు కోడిపందేలపై హైకోర్టులో విచారణ
  • ఇప్పటివరకు నివేదిక సమర్పించని సీఎస్, డీజీపీ

సంక్రాంతి నేపథ్యంలో జరిపే కోడి పందేల నిర్వహణపై స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లోని పలుచోట్ల ఆ పందేలు జరిగిన విషయం తెలిసిందే. కోడి పందేల నిర్వహణపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందేల నిర్వహణపై విచారణ నివేదిక సమర్పించనందుకు సీఎస్‌, డీజీపీపై న్యాయస్థానం ఆగ్రహం వ్య‌క్తం చేసింది. ఇందులో అల‌స‌త్వం ప‌నికిరాద‌ని తెలిపింది. ఇప్ప‌టి వ‌ర‌కు నివేదిక స‌మ‌ర్పించ‌నందుకు గానూ వివ‌ర‌ణ ఇచ్చుకోవ‌డానికి ఈ నెల 29న వారిద్ద‌రు వ్యక్తిగతంగా కోర్టుకు హాజ‌రుకావాల‌ని ఆదేశించింది.    

  • Loading...

More Telugu News