Australian open: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జకోవిచ్‌కి అనుకోని ఎదురుదెబ్బ
- అన్‌సీడెడ్ ప్లేయర్ చేతిలో ఓడిన మాజీ నెంబర్ వన్
- రెండు పాయింట్ల తేడాతో దక్షిణ కొరియా ఆటగాడి విజయం
- ఆరు సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన జకోవిచ్
ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ చరిత్రలో ఓ సంచలనం నమోదైంది. ఆరు సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన జకోవిచ్, అన్‌సీడెడ్ ప్లేయర్ చేతిలో ఓడిపోయాడు. నాలుగో రౌండ్లో దక్షిణ కొరియాకు చెందిన హియోన్ చంగ్, జకోవిచ్‌ను 7-6, 7-5, 7-6 తేడాతో ఓడించాడు. తొలిసారిగా గ్రాండ్‌స్లామ్ క్వార్టర్ ఫైనల్‌కి చేరిన హియోన్ అత్యుత్తమ ప్రతిభ కనబర్చి మాజీ నెంబర్ వన్ని ఓడించాడు.
మూడు గంటలకుపైగా సాగిన ఈ మ్యాచ్‌లో రెండు సెట్లు టై బ్రేకర్ కాగా, మూడో సెట్లో ఫలితం తేలింది. గతంలో జకోవిచ్ 2008, 2011, 2012, 2013, 2015, 2016లలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచాడు. గతేడాది కూడా జకోవిచ్ రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే.