Narendra Modi: గణతంత్ర దినోత్సవానికి హాజరుకాబోతున్న దేశాల అధినేతలు వీరే!
- పది మంది ముఖ్య అతిథులకు ఆహ్వానం
- హాజరుకానున్న ఆగ్నేయాసియా దేశాల అధినేతలు
- ముమ్మరమైన పనులు
2018 గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశరాజధాని ఢిల్లీ సిద్ధమైంది. ఈ ఏడాది వేడుకకు పది మంది ఆగ్నేసియా దేశాల అధినేతలు హాజరుకానుండటంతో రక్షణ, భద్రతా చర్యల మీద అధికారులు శ్రద్ధ వహిస్తున్నారు. వేదిక చుట్టూ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్, వందల సంఖ్యలో వ్యక్తిగత బలగాల మోహరింపు వంటి చర్యలు తీసుకుంటున్నారు. ఆగ్నేయాసియా దేశాలైన థాయ్‌లాండ్, వియత్నాం, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, మయన్మార్, కాంబోడియా, లావోస్, బ్రూనైల నుంచి అధినేతలు, వారి సిబ్బందికి కావాల్సిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
ఇక వేడుకకు హాజరుకాబోతున్న దేశాల అధినేతల వివరాల్లోకి వెళ్తే... ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, సింగపూర్ ప్రధాని లీ సైన్ లూంగ్, వియత్నాం ప్రధాని గువెన్ జువాన్ ఫుక్, మలేషియా ప్రధాని డాతో శ్రీ మహ్మద్ నజీబ్ బిన్ తున్ హజీ అబ్దుల్ రజాక్, థాయ్‌లాండ్ ప్రధాని జనరల్ ప్రయూత్ చాన్ ఓ చా, మయన్మార్ స్టేట్ కౌన్సిల్ ఆంగ్ సాన్ సూ కీ, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటేర్ట్, బ్రూనై సుల్తాన్ థాంగ్‌లాన్ సిసౌలిత్, కాంబోడియా ప్రధాని హున్‌సెన్‌లు హాజరుకానున్నారు.