karnataka bandh: అట్టుడుకుతున్న కర్ణాటక.. 10 రోజుల వ్యవధిలోనే రెండుసార్లు బంద్ లు!
- జనవరి 25, ఫిబ్రవరి 4న రాష్ట్ర బంద్ లు
- గోవాతో మహాదాయి నీటి వివాదమే కారణం
- మోదీ కలగజేసుకోవాలంటూ డిమాండ్
జనవరి 25, ఫిబ్రవరి 4న కర్ణాటక రాష్ట్ర బంద్ కు నిరసనకారులు పిలుపునిచ్చారు. గోవాతో ఉన్న మహాదాయి నది నీటి వివాదం నేపథ్యంలో కన్నడిగులు రాష్ట్ర బంద్ కు సిద్ధమయ్యారు. ఈ వివాదంలో భారత ప్రధాని మోదీ కలగజేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన జనవరి 25న మైసూరులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీ ఉంది. ఫిబ్రవరి 4న బెంగళూరుకు నరేంద్ర మోదీ వస్తుండటం గమనార్హం. బంద్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూతపడనున్నాయి. కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు, కర్ణాటక ఫిలిం ఛాంబర్ కూడా బంద్ కు మద్దతు పలికాయి.