Cock: లాకప్ లోకి చేరిన కోడి పుంజులు... తిండి పెట్టలేక పోలీసుల అవస్థలు!

  • సంక్రాంతి సీజన్ లో అదుపులోకి కోడిపుంజులు
  • నిందితులకు వ్యక్తిగత పూచీకత్తు
  • కోళ్లన్నింటినీ ఒకేసారి కోర్టుకు తేవాలన్న న్యాయమూర్తి

ఓ రెండు వారాల క్రితం వరకూ ఆ కోడి పుంజులు మహారాజులలాగా బతికినవి. పొద్దున్నే జీడిపప్పు, బాదంపప్పు నుంచి చికెన్, మటన్ వరకూ లాగించినవే. కానీ ఇప్పుడు లాకప్ లో మగ్గుతున్నాయి. వాటికి తిండి పెట్టలేక పోలీసులు నానా తంటాలూ పడుతున్నారు. ఇంతకీ ఏమైందో తెలుసా?... సంక్రాంతి సందర్భంగా విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం పరిసర ప్రాంతాల్లో కోడి పందేలు పెడుతూ 9 పుంజులను, ఎనిమిది మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను వ్యక్తిగత పూచీకత్తుపై విడిచిపెట్టారు.

ఆ తరువాత వారిని, పుంజులను కోర్టుకు తీసుకెళ్లి న్యాయమూర్తి ముందు నిలిపారు. మిగతా ప్రాంతాల్లోనూ అదుపులోకి తీసుకున్న కోడిపుంజులన్నింటినీ ఒకేసారి ప్రవేశపెట్టాలని న్యాయమూర్తి ఆదేశించడంతో వాటిని మళ్లీ వెనక్కు తీసుకువచ్చి, ఏం చేయాలో తెలియక, లాకప్ లో ఉంచారు. ఇప్పుడు అచ్యుతాపురం స్టేషన్ లాకప్ నేరాలకు పాల్పడిన వాళ్లకు బదులుగా కోళ్లతో నిండుతోంది.

  • Loading...

More Telugu News