air bus: ఏపీలో ఎయిర్ బస్ విమాన తయారీ యూనిట్?
- ఎయిర్ బస్ సంస్ధను ఏపీలో నెలకొల్పాలని కోరిన బాబు
- దావోస్ లో ఎయిర్ బస్ సీఈవోతో సమావేశం
- ఏడాది చివరికల్లా ఎయిర్ బస్ ప్రాజెక్టు ప్రారంభిస్తామన్న డిర్క్ హోక్
ఆంధ్రప్రదేశ్ లో ఎయిర్ బస్ సంస్థ యూనిట్ ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. దావోస్ లో ఎయిర్ బస్ డిఫెన్స్ సంస్థ సీఈవో డిర్క్ హోక్ తో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏపీలో సీ-295 విమానాల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు అన్ని విధాలుగా సహకరిస్తామని, సత్వరమే అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు.
కాగా, ఎయిర్ బస్ సంస్థ టాటా గ్రూప్ తో కలిసి భారత్ లో సీ-295 విమాన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తుండగా, దానిని తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ కోరుతోంది. దీంతో గతేడాది ఎయిర్ బస్ సంస్థ ప్రతినిధులు పరిశ్రమ ఏర్పాటుకు గల సౌకర్యాలను రాష్ట్రానికి వచ్చి పరిశీలించారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరిలోగా పరిశ్రమ పనులు ప్రారంభిస్తామని డిర్క్ హోక్ తెలిపారు. ఈ సందర్భంగా వివిధ దేశాల్లో తాము నెలతకొల్పిన తమ ఉత్పాదక యూనిట్లను ఒకసారి సందర్శించాలని చంద్రబాబుని ఆహ్వానించారు.