gst: 'జీఎస్టీ' కాన్సెప్ట్ కాపీరైట్ విషయంలో ఆర్జీవీకి కోర్టు నోటీసులు!
- కోర్టులో పిటిషన్ వేసిన పి.జయకుమార్
- తాను పంపిన స్క్రిప్ట్‌ను తన పేరుతో వాడుకున్నాడని ఫిర్యాదు
- రేపు విడుదలకానున్న లఘుచిత్రం
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తన కాన్సెప్ట్‌ను 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' లఘుచిత్రం కోసం ఉపయోగించాడని పి.జయకుమార్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ మేరకు ఆర్జీవీకి కోర్టు నుంచి నోటీసులు అందినట్లు తెలుస్తోంది. 2015 ఏప్రిల్ 1న ఈ స్క్రిప్ట్‌ను తాను వర్మకు పంపానని, కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోగా, ఇప్పుడు జీఎస్టీ చిత్రంగా మలిచి విడుదల చేస్తున్నాడని జయకుమార్ తెలిపారు.
ట్రైలర్లో హీరోయిన్ చెప్పిన ప్రతి మాట తాను రాసిందేనని, రామ్‌గోపాల్ వర్మ కనీసం క్రెడిట్స్ కూడా ఇవ్వకుండా తన స్క్రిప్ట్‌ను ఉపయోగించుకున్నాడని గతంలో జయకుమార్ అన్నాడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా వర్మ ఈ లఘుచిత్రాన్ని విడుదల చేయనుండగా.. మహిళా సంఘాల నుంచి తీవ్రవ్యతిరేకత వ్యక్తమవుతోన్న సంగతి విదితమే!