petrol: ఆగని పెట్రోల్, డీజిల్ ధరల మంట... హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.76.76

  • డీజిల్ ధర రూ.69.02
  • దేశీయ, అంతర్జాతీయ అంశాలతో పెరుగుదల
  • మూడేళ్ల గరిష్ట స్థాయికి ధరలు

అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో దేశీయంగా వాటి ధరలు వాహనదారులకు మరోసారి కాక పుట్టిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలో పెట్రోల్ ధర ఈ రోజు లీటర్ కు రూ.76.76కు చేరుకుంది. డీజిల్ లీటర్ ధర రూ.69.02కు చేరింది. దేశ రాజధాని సహా ఇతర ప్రాంతాల్లోనూ ధరలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.72.49కు చేరుకుంది. 2014 ఆగస్ట్ లో ఉన్న రూ.72.51 స్థాయికి మళ్లీ చేరుకున్నాయి.

ఇక ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.80.39 కాగా, చెన్నైలో రూ.75.18గా ఉంది. దేశీయ, అంతర్జాతీయ అంశాలే చమురు ధరల పెరుగుదలకు కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. పెట్రోల్ ఎగుమతి దేశాల కూటమి ఉత్పత్తిని తగ్గించడంతో ధరలు పెరుగుతున్నాయంటున్నారు. ఈ రోజు బ్రెంట్ క్రూడాయిల్ ఒక బ్యారెల్ 70 డాలర్ల మార్క్ ను దాటుకుని 71.03 డాలర్లకు చేరుకుంది.

  • Loading...

More Telugu News