Andhra Pradesh: పద్మ పురస్కారాలు: మహారాష్ట్ర 11, కర్ణాటక 9... ఏపీ 1, తెలంగాణ 0!

  • మొత్తం 85 మందికి 'పద్మ' పురస్కారాలు
  • బీజేపీ పాలిత రాష్ట్రాలకు పెద్ద పీట వేశారని విమర్శలు
  • ఏపీకి 1, తెలంగాణకు అది కూడా లేదు!

దేశవ్యాప్తంగా మొత్తం 85 మందికి 'పద్మ' పురస్కారాలను ప్రకటించిన నరేంద్ర మోదీ సర్కారు తెలుగు రాష్ట్రాలకు మొండి చెయ్యి చూపించింది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు, త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకూ అవార్డుల్లో పెద్దపీట వేసిందన్న విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కరికి మాత్రమే అవార్డు అందగా, తెలంగాణకు అది కూడా లేదు.

ఏపీ నుంచి కిడాంబి శ్రీకాంత్ పేరు పద్మశ్రీకి ఎంపికైంది. అది కూడా ఆటగాళ్ల కోటాలో. తెలంగాణకు ఒక్క అవార్డు కూడా దక్కలేదు. బీజేపీ పాలిత మహారాష్ట్రకు అత్యధికంగా 11 అవార్డులు దక్కగా, మధ్యప్రదేశ్ కు 4, గుజరాత్ కు 3 'పద్మ' అవార్డులు లభించాయి. ఈ సంవత్సరం ఎన్నికలు జరగనున్న కర్ణాటకకు ఏకంగా 9 అవార్డులు లభించాయి. ఇంకా తాము పాగా వేయాలని భావిస్తున్న తమిళనాడుకు 5, పశ్చిమ బెంగాల్ కు 5, కేరళకు 4, ఒడిశాకు 4 అవార్డులను ఇచ్చిన కేంద్రం మిగతా రాష్ట్రాలను చిన్న చూపు చూసిందన్న విమర్శలు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News