kodela siva prasad rao: మార్చి మొదటి వారం నుంచి బడ్జెట్ సమావేశాలు: కోడెల శివప్రసాద్‌ రావు

  • మార్చి చివరి వారం వరకు సమావేశాలు
  • భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందడం ఖాయం
  • నవ్యాంధ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రజలంతా ఐక్యంగా కృషి చేయాలి
  • రిపబ్లిక్ డే సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన కోడెల

మార్చి మొదటి వారం నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశంగా ఇండియాకు గుర్తింపు లభించిందన్నారు.

దేశంలోని 137 కోట్ల మంది కుల, మతాలకు అతీతంగా కృషి చేస్తే, రాబోయే కొన్ని సంవత్సరాల్లో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందడం ఖాయమన్నారు. నవ్యాంధ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రజలంతా ఐక్యంగా కృషి చేయాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి నేతృత్వంలో దేశం, రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతున్నాయన్నారు.  
  

  • Loading...

More Telugu News