Republic Day: రిపబ్లిక్ డే రోజు నల్ల జెండా ఎగరవేసిన మావోయిస్టులు
- ఒడిషాలోని మల్కన్‌గిరి జిల్లాలో నల్లజెండా
- అధికారుల వల్ల గిరిజనులకు ఒరిగేదేమీ లేదంటూ పోస్టర్లు
- జెండాను తొలగిస్తే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరికలు
ఒడిషాలోని మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ సమితి పప్పులూర్లో మావోయిస్టులు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. అక్కడి ప్రాథమిక పాఠశాలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరనీయకుండా వారు అడ్డుకున్నారు. అంతేకాకుండా దాని స్థానంలో నల్లజెండాను ఎగరేసి హెచ్చరిక పోస్టర్లను అంటించారు.
ఈ నల్ల జెండాను ఎవరైనా తీసివేస్తే కనుక తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు పోస్టర్లలో హెచ్చరికలు జారీ చేశారు. బీజేపీ, బీజేడీ ప్రభుత్వాలు గిరిజనులకు ఎటువంటి మేలూ చేయడం లేదని, గిరిజనుల కోసం పెట్టిన అభివృద్ధి పథకాలను గిరిజనులకు చేరనీయడం లేదని, రాజకీయ నాయకులు, అధికారులు, సంక్షేమ కార్యక్రమాల వల్ల గిరిజనులకు ఒరిగేదేమీ లేదని మావోయిస్టులు పోస్టర్లలో పేర్కొన్నారు.