Narendra Modi: మోదీ ఆదేశాలను పాటించిన రైల్వే శాఖ... 'వికలాంగులు' పదం దివ్యాంగులుగా మార్పు!
- రాయితీ పత్రాల్లో సవరణలు
- మోదీ చెప్పిన రెండేళ్లకు అమలు
- ఫిబ్రవరి 1 నుంచి పూర్తి స్థాయి అమలు
వికలాంగులను దివ్యాంగులుగా సంబోధించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు భారతీయ రైల్వే మార్పులు చేసింది. టికెట్ ధర మీద రాయితీ కల్పించే అన్ని రకాల పత్రాల్లో వికలాంగులు అనే పదాన్ని దివ్యాంగులుగా మార్చింది. అంతేకాకుండా చెవుడు, మూగ, గుడ్డి అనే పదాలకు బదులుగా దృష్టి, వినికిడి, వాక్కు లోపం ఉన్నవారు అంటూ ప్రత్యేక సంబోధనల్లో కూడా రైల్వే శాఖ మార్పులు చేసింది. ప్రధాని మోదీ చెప్పిన రెండేళ్ల తర్వాత ఈ మార్పులు చేయడం గమనార్హం.
ఫిబ్రవరి 1 నుంచి ఈ మార్పులు పూర్తిస్థాయిలో అమలుకానున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. వివిధ లోపాలు ఉన్నవాళ్లందరికీ కలిపి దాదాపు 53 రకాల రాయితీలను రైల్వే అందజేస్తోంది. వీటన్నింటి విలువ సంవత్సరానికి రూ. 1600 కోట్లు ఉంటుందని ఓ అంచనా.