Chandrababu: రెండు ఏజెన్సీలతో చంద్రబాబునాయుడి ఎన్నికల సర్వే.. ఏం తేలిందంటే!
- 2014 కంటే ఎక్కువ సీట్లను కైవసం చేసుకోనున్న టీడీపీ
- 140 నుంచి 145 సీట్లు
- రాయలసీమలో మరింత బలపడ్డ టీడీపీ
తదుపరి ఎన్నికలు సకాలంలోనే జరుగుతాయా? లేక ముందస్తు ఎన్నికలు వస్తాయా? అనే విషయంలో క్లారిటీ లేనప్పటికీ... ఎన్నికల వేడి మాత్రం అప్పుడే మొదలైంది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు ప్రైవేట్ ఏజెన్సీలతో సర్వే చేయించినట్టు సమాచారం. ఇందులో పలు ఆసక్తికర విషయాలు తేలాయి.
సర్వే ఫలితాలు ఇవే...
- 2014 కంటే ఎక్కువ సీట్లను టీడీపీ కైవసం చేసుకుంటుంది.
- టీడీపీకి 140 నుంచి 145 వరకు సీట్లు వస్తాయి.
- రాయలసీమలో టీడీపీ మరింత బలం పుంజుకుంది.
- 2014 కంటే ఎక్కువ సీట్లు రాయలసీమలో వస్తాయి.
- కడప, కర్నూలు జిల్లాల్లో కీలక వైసీపీ నేతలు చేరడంతో బలపడ్డ టీడీపీ.
- రెడ్డి సామాజికవర్గం ఎక్కువగా ఉండే కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ కొంచెం బలహీనంగా ఉంది.
- నెల్లూరు జిల్లాలో టీడీపీ కొంచెం వెనుకబడి ఉంది.
- కాపు రిజర్వేషన్లకు చంద్రబాబు అనుకూలంగా ఉండటంతో... తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి ఎదురు లేదు.
- పెన్షన్లు, రేషన్ సరకుల పంపిణీపై మెజారిటీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారు.
- ప్రభుత్వంపై ప్రజలు సానుకూలంగా ఉన్నా... కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు నిరాశాజనకంగా ఉంది.