New Delhi: పని మనిషిని అవమానించిన ఢిల్లీ వైద్యురాలు... వైరల్ అయిన ఫోటో వెనుక వాస్తవం ఇది!

  • రైల్లో కింద కూర్చున్న ఆయమ్మ
  • ఫోటో తీసి ప్రచురించిన 'ది ప్రింట్‌ ఇండియా' 
  • నిజాలు తెలుసుకోకుండా ఈ రాతలేంటి?
  • రిపోర్టర్‌ సన్యా ధింగ్రాపై మహిళా డాక్టర్ ఆగ్రహం

గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో హల్ చేసిందో చిత్రం. తన బిడ్డ ఆలనా పాలనా చూసుకునే పనిమనిషిపై, ఓ ధనవంతురాలికి ఎంతమాత్రమూ దయ లేదని, రైల్లో ఖాళీగా సీట్లు ఉన్నప్పటికీ, ఆమెను కింద కూర్చోబెట్టిందని చెబుతూ, 'ది ప్రింట్‌ ఇండియా' రిపోర్టర్‌ సన్యా ధింగ్రా, తనకు ఢిల్లీ మెట్రోలో కనిపించిన ఓ దృశ్యాన్ని పత్రికలో ప్రచురించింది. ఇది వైరల్ కావడంతో ఆ మహిళపై విమర్శలు వెల్లువెత్తాయి. "కనీసం తన పనిమనిషిని కూర్చోమని కూడా చెప్పలేదు" అంటూ సన్యా దింగ్రా ప్రచురించిన చిత్రంపై సదరు మహిళ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, నిజానిజాలు తెలుసుకోకుండా అభాండాలు వేస్తున్నారంటూ, తన బ్లాగ్ లో వివరణ ఇచ్చారు. తాను ఓ వైద్యురాలినని, అపోలో ఆసుపత్రిలో పని చేస్తానని చెబుతూ అసలేం జరిగిందన్న విషయాన్ని చెప్పుకొచ్చారు.

తాను, తన బిడ్డ, ఆయమ్మతో కలసి మెట్రో రైలులో ఇంటికి బయలుదేరామని, అప్పటికే తమ వద్ద చాలా లగేజీ ఉండగా, రైలు ఎక్కిన సమయంలో చాలా మంది ప్రయాణికులు ఉన్నారని, ఎంతో మంది అమ్మాయిలు కింద కూర్చుని ఉన్నారని చెప్పుకొచ్చారు.కాసేపు తన బిడ్డను ఇద్దరమూ కలసి ఆడించామని, మరో మహిళ తనకు సీట్ ఇచ్చి కిందకు దిగిపోగా, ఆ సమయంలో సన్య తమ కోచ్ లోకి వచ్చిందని అన్నారు. అప్పటికే అలసిపోయిన తమ ఆయా, కింద కూర్చోగా, కాసేపటికి మరో సీటు ఖాళీ అయినా, ఆమె కింద కూర్చోవడమే బాగుందని చెప్పిందని తెలిపారు.
చివరకు తాము ఎంజీ రోడ్డు స్టేషన్ లో దిగిపోయామని, సన్య తమకు చెప్పకుండానే ఆ ఫోటో తీసిందని ఆరోపించారు. ఓ డాక్టర్ గా ప్రజలకు సేవ చేయడమే తనకు తెలుసునని, తన ఇంట్లో చాలా రోజుల నుంచి ఆయా పని చేస్తూ, తమతోనే ఉంటోందని గుర్తు చేసుకున్న ఆమె, తన అనుమతి లేకుండా ఆమె ఓ ఫోటో తీయడం, వాస్తవాలు తెలుసుకోకుండా మరో జర్నలిస్ట్ కథనం రాయడం సరికాదని మండిపడ్డారు

  • Loading...

More Telugu News