China: డ్రాగన్ కంట్రీ మరో రికార్డు.. కేవలం 9 గంటల్లోనే రైల్వే స్టేషన్‌ను నిర్మించిన చైనా!

  • నిర్మాణ రంగంలో తమకు తిరుగులేదని నిరూపించిన చైనా
  • 1500 మంది సిబ్బంది, కార్మికులతో రైల్వే స్టేషన్ నిర్మాణం
  • స్టేషన్ నిర్మాణంతో 7 గంటల ప్రయాణం గంటన్నరకు తగ్గిన వైనం

టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించుకుంటున్న చైనా మరో రికార్డు సృష్టించింది. కేవలం 9 గంటల్లో ఏకంగా రైల్వే స్టేషన్‌నే నిర్మించి నిర్మాణ రంగంలో తమకు తిరుగులేదని నిరూపించింది. జనవరి 19న మొత్తం 1500 మంది రైల్వే సిబ్బందితో లాంగ్యాన్ పట్టణంలోని నాన్‌లాంగ్ రైల్వే స్టేషన్‌ను నిర్మించింది. చైనాలోని మూడు ప్రధాన రైల్వే లైన్లు అయిన గాంగ్‌లాంగ్ రైల్వే, గాన్‌రుయిలింగ్ రైల్వే, ఝాంగ్‌లాంగ్ రైల్వేలను అనుసంధానం చేసేందుకు ఈ స్టేషన్‌ను నిర్మించారు. పట్టాల ఏర్పాటు నుంచి సిగ్నలింగ్ వ్యవస్థ వరకు అన్నింటిని జాగ్రత్తగా ఏర్పాటు చేశారు. కేవలం 9 గంటల్లోనే మొత్తం పనులను పూర్తి చేశారు.

దేశవ్యాప్తంగా హైస్పీడ్ రైల్వే వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చైనా 247 కిలోమీటర్ల పొడవైన ప్రాజెక్టును చేపట్టింది. ఇందుకోసం రూ. 7 లక్షల కోట్లు వెచ్చిస్తోంది. తాజాగా నిర్మించిన రైల్వే స్టేషన్ అందులో భాగమే. ఈ స్టేషన్ నిర్మాణం వల్ల మధ్య-ఆగ్నేయ చైనాల మధ్య ఉన్న 7 గంటల ప్రయాణ దూరం ఇకపై గంటన్నరకు తగ్గిపోనుంది.

  • Loading...

More Telugu News