finance minister: ఆర్థిక సర్వేను లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి!
- 2018-19లో జీడీపీ వృద్ధి 7-7.5 శాతం మధ్య వుండొచ్చని అంచనా
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇది 6.5 శాతం
- లోక్‌సభ సమావేశాలు గురువారానికి వాయిదా
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018 ఆర్థిక సర్వేను సోమవారం మధ్యాహ్నం పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
సర్వే ముఖ్యాంశాలు....
- 2018-19 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 7 నుంచి 7.5 శాతం మధ్య వుండొచ్చు.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇది 6.5 శాతానికి చేరుకుంటుంది.
- మధ్యకాలికంగా దృష్టి సారించాల్సిన రంగాలు - వ్యవసాయం, విద్య, ఉపాధి. వీటికి అధిక ప్రాధాన్యత ఇస్తాం.
- పెరుగుతున్న చమురు ధరలు ఆందోళన కలిగిస్తున్నాయి.
- సౌదీ ఆరామ్‌కో లిస్టయితే చమురు ధరలు మరింత పెరగొచ్చు.
- ప్రత్యక్ష పన్నుల వసూలు లక్ష్యాన్ని ఈ ఆర్థిక సంవత్సరం చేరుకునే అవకాశం.
- జీడీపీ వృద్ధి కోసం గత ఏడాది కాలం నుంచి అనేక సంస్కరణలు చేపట్టాం.
- 2017-18లో ఎగుమతులు వృద్ధి రేటు 12.1 శాతంగా ఉండనున్నట్టు తెలిపింది.
- తొలిసారి భారతీయ చరిత్రలో మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు దేశీయ ఎగుమతుల్లో 70 శాతాన్ని నమోదుచేసినట్టు పేర్కొంది.
- 2019 ఆర్థిక సంవత్సరంలో సగటున క్రూడ్ ఆయిల్ ధరలు 12 శాతం పెరిగే అవకాశముందని పేర్కొంది.