Venkaiah Naidu: ఫిబ్రవరి 2 నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉపరాష్ట్రపతి పర్యటన

  • మూడు రోజుల పాటు పర్యటన
  • పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న వెంకయ్యనాయుడు
  • వివరాలు ప్రకటించిన ప్రభుత్వ అదనపు కార్యదర్శి అశోక్ బాబు 

ఫిబ్రవరి 2 వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పర్యటించనున్నారు. ప్రభుత్వ అదనపు కార్యదర్శి లెఫ్టినెన్ట్ కల్నల్ ఎం.అశోక్ బాబు ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. వెంకయ్య నాయుడు పర్యటన వివరాలు..

* ఫిబ్రవరి 2వ తేదీ మధ్యాహ్నం 1.55 గంటలకు ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన ప్రత్యేక విమానంలో బయలుదేరతారు

* సాయంత్రం 4.15 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు

* అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి సాయంత్రం 4.50 గంటలకు విజయవాడ  
  బెంజిసర్కిల్ సమీపంలోని శంకర్ నేత్ర చికిత్సాలయానికి చేరుకుంటారు

* సాయంత్రం 5 గంటలకు ఆ చికిత్సాలయంలో అదనపు సౌకర్యాలను ప్రారంభిస్తారు

* అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు ఆత్కూరు గ్రామం చేరుకుంటారు. ఆ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు.

* అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 6.50 గంటలకు స్వర్ణ భారతి ట్రస్ట్ చేరుకుంటారు. ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు

* 3వ తేదీ శనివారం ఉదయం 7.45 గంటలకు స్వర్ణభారతి ట్రస్ట్ నుంచి రోడ్డు మార్గంలో  
 బయలుదేరి 8 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు.

* అక్కడి నుంచి హెలికాఫ్టర్ లో బయలుదేరి 8.30 గంటలకు పెదనందిపాడు హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో 8.50 గంటలకు పెదనందిపాడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి చేరుకుంటారు. 9.30 గంటలకు జరిగే కాలేజీ స్వర్ణోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

* అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 10.15 గంటలకు హెలీప్యాడ్ వద్దకు చేరుకుని, హెలీకాఫ్టర్ లో బయలుదేరి 10.45 గంటలకు గుంటూరులోని ఒమెగా ఆస్పత్రి సమీపంలోని హెలీప్యాడ్
వద్దకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో అగతవరప్పాడు ఒమేగా ఆస్పత్రికి
చేరుకొని 150 పడకల సూపర్ స్పెషాలిటీ ఆంకాలజీ సెంటర్ ను ప్రారంభిస్తారు.

* అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 12 గంటలకు జేకేసీ కాలేజీ వద్దకు చేరుకొని
నాగార్జున ఎడ్యుకేషన్ సొసైటీ స్వర్ణోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. జేకేసీ  
కాలేజీ నుంచి 2.15 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. హెలీకాఫ్టర్ లో సాయంత్రం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. రోడ్డు మార్గంలో బయలుదేరి 3.15 గంటలకు స్వర్ణభారతి ట్రస్ట్ చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు.

  * 4వ తేదీ ఆదివారం ఉదయం 9.30 గంటలకు స్వర్ణభారతి ట్రస్ట్ నుంచి రోడ్డు మార్గంలో
 గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ ఆయనకు ప్రముఖులు వీడ్కోలు పలుకుతారు. అక్కడి నుంచి 10 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.15 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకొని, 12.35 గంటలకు తన నివాసానికి వెంకయ్యనాయుడు
చేరుకుంటారు.

  • Loading...

More Telugu News