parliamentarian: ఐదుగురు ఎంపీలకు ఔట్‌స్టాండింగ్ పార్లమెంటేరియన్ అవార్డులు
- 2013, 2014, 2015, 2016, 2017 అవార్డులు ఒకేసారి
- గ్రహీతల్లో గులాం నబీ ఆజాద్, దినేష్ త్రివేదీ, నజ్మా హెప్తుల్లా
- ప్రకటించిన లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్
గడచిన ఐదేళ్లకు కలిపి ఒక్కో ఏడాదికి ఒక్కో ఎంపీ చొప్పున మొత్తం ఐదుగురు ఎంపీలకు ఔట్‌స్టాండింగ్ పార్లమెంటేరియన్ అవార్డులను లోక్‌సభ ప్రకటించింది. అవార్డు గ్రహీతల్లో మణిపూర్ గవర్నర్, ఐదు సార్లు రాజ్యసభ సభ్యురాలు నజ్మా హెప్తుల్లా (2103), బీజేపీ లోక్‌సభ సభ్యుడు హుకుందేవ్ నారాయణ్ యాదవ్ (2014), కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ (2015), తృణమూల్ కాంగ్రెస్‌కి చెందిన దినేష్ త్రివేదీ (2016), లోక్ బిజు జనతాదళ్‌కి చెందిన ఐదు సార్లు రాజ్యసభ సభ్యుడు భర్తృహరి మహతాబ్ (2017) ఉన్నారు.
ఈ అవార్డులను లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్షురాలిగా ఉన్న ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ ప్రకటించింది. ఈ అవార్డులను 1995 నుంచి అందజేస్తున్నారు. ఇప్పటివరకు 18 మంది ఎంపీలు ఈ అవార్డును అందుకున్నారు. మొదటి అవార్డును సమాజ్‌వాదీ జనతా పార్టీకి చెందిన చంద్రశేఖర్ అందుకున్నారు.