polavaram: ఢిల్లీలో పోలవరంపై ముగిసిన చర్చ.. కీలక ఆదేశాలు జారీ చేసిన నితిన్ గడ్కరీ
- భేటీలో పాల్గొన్న రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, గుత్తేదారులు
- స్పిల్ వే, స్పిల్ ఛానెల్ పనులు నవయుగ కంపెనీకి అప్పగింతకు ఆదేశాలు
- పోలవరం నిర్ణీత సమయంలో పూర్తి చేయాలి: నితిన్ గడ్కరీ
ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ కార్యాలయంలో పోలవరంపై సమావేశం ముగిసింది. దాదాపు రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ.. ఏపీ జలవనరుల శాఖ అధికారులు, గుత్తేదారులకు కీలక ఆదేశాలు చేశారు. స్పిల్ వే, స్పిల్ ఛానెల్ పనులు నవయుగ కంపెనీకి అప్పగించడానికి గడ్కరీ అంగీకారం తెలిపారు. ఆ సంస్థతో ఈ మేరకు ఒప్పందం చేసుకుని, పోలవరం పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మరో వారం రోజుల్లో స్పిల్ వే, స్పిల్ ఛానెల్ పనులు నవయుగ కంపెనీకి అప్పగించే ప్రక్రియ ముగియనున్నట్లు తెలిసింది.