Rajamouli: డాక్టర్ పాత్రలో కనిపించనున్న రాజమౌళి?
- రాజమౌళి శిష్యుడి కొత్త సినిమా
- నూతన నటీనటులతో
- కథ .. మాటలు అందిస్తోన్న మరో దర్శకుడు
దర్శకుడిగా రాజమౌళికి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. అపజయమెరుగని దర్శకుడిగా ఆయనను ఎంతోమంది అభిమానిస్తుంటారు. అలాంటి రాజమౌళి సరదాగా అప్పుడప్పుడు తెరపై మెరిసిన సందర్భాలు వున్నాయి. ఈ సారి మాత్రం కాస్త ఎక్కువ సేపే ఆయన తెరపై కనిపించనున్నారని తెలుస్తోంది .. అదీ డాక్టర్ పాత్రలో.
రాజమౌళి శిష్యుడు కరుణ్ కుమార్ ('ద్రోణ' దర్శకుడు) ఓ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. నూతన నటీనటులతో రూపొందే ఈ సినిమాకి, సుకుమార్ శిష్యుడు హరిప్రసాద్ ('దర్శకుడు' మూవీ డైరెక్టర్) కథ .. మాటలను అందిస్తున్నాడు. ఈ సినిమాలో కీలకమైన డాక్టర్ పాత్ర ఉండటంతో, ఆ పాత్రను చేయవలసిందిగా రాజమౌళిని కలిసి రిక్వెస్ట్ చేశారట. ఆ పాత్రను చేయడానికి రాజమౌళి అంగీకరించాడని అంటున్నారు. ఈ ప్రచారంలో వాస్తవమెంతన్నది చూడాలి.