ram gopal varma: వర్మ నాతో ‘జీఎస్ టీ’ పార్ట్ -2 తీస్తానంటే నేను రెడీ: శృంగార నటి షకీలా
- దర్శకుడు వర్మ అడిగితే తప్పకుండా చేస్తాను
- కాకపోతే, ఆయన నన్ను సన్నబడమంటారు
- నేను సన్నబడేందుకు రెండేళ్లు పడుతుందంటూ నవ్వులు చిందించిన షకీలా
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘గాడ్ సెక్స్ ట్రూత్ (జీఎస్ టీ)’ పార్ట్ -2 తనతో తీస్తానంటే, అందులో నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రముఖ శృంగార నటి షకీలా చెప్పింది. ‘ఎస్ టీవీ’ ఇంటర్వ్యూలో అడిగిన ఓ ప్రశ్నకు ఆమె పైవిధంగా సమాధానమిచ్చింది. ఇప్పటికే చాలా శృంగార చిత్రాల్లో షకీలా నటించింది.
‘మీతో ‘జీఎస్ టీ’ పార్ట్ -2 ను వర్మ తీస్తానంటే..’ అని ప్రశ్నించగా షకీలా స్పందిస్తూ, ‘తప్పకుండా, రామ్ గోపాల్ వర్మ అంతటి దర్శకుడు అడిగితే చెయ్యకుండా ఎలా ఉంటాం! కాకపోతే, నన్ను సన్నబడమని.. ఓ 30 కిలోల బరువు తగ్గమని వర్మ అంటే.. నేను సన్నబడేందుకు ఓ రెండు సంవత్సరాలు పడుతుంది!’ అని నవ్వులు చిందించింది.