kim jang un: కిమ్ జాంగ్ ఉన్ విధించే మరణశిక్షలు ఎలా ఉంటాయంటే...!
- వెలుగు చూసిన కిమ్ జాంగ్ ఉన్ మరో కిరాతకం
- మీటింగ్ లో నిద్రపోయాడని హై కాలిబర్ మిషన్ గన్ తో కాల్చిచంపించిన కిమ్
- రక్షణ మంత్రిని కూడా ఆ రకంగానే చంపించిన కిమ్
ఉత్తరకొరియా అధినేత, నియంత కింమ్ జాంగ్ ఉన్ తీసుకునే చర్యలు భీతిగొలిపేలా ఉంటాయన్నది పలు సందర్భాల్లో బహిర్గతమైంది. ఆమధ్య ఆ దేశ విద్యాశాఖ ఉన్నతాధికారిని కిమ్ చంపించిన తీరు తాజాగా వెలుగులోకి వచ్చింది. దాని వివరాల్లోకి వెళ్తే... రియాంగ్ జిన్ అనే ఉన్నత శ్రేణి విద్యాశాఖ అధికారి 2016 ఆగస్టులో కిమ్ నిర్వహించిన మీటింగ్ కు వెళ్లాడు. మీటింగ్ లో కిమ్ మాట్లాడుతున్న సమయంలో నిద్రపోయాడు. దీంతో ఆగ్రహం ముంచుకొచ్చిన కిమ్ హై క్యాలిబర్ మిషన్ గన్ తో అతని శరీరం తూట్లుపడేలా కాల్చి చంపించాడు.
అతనిలాగే రక్షణ మంత్రిగా పని చేసిన హోంగ్ యోంగ్ చోయ్ కూడా కిమ్ నిర్వహించిన సమావేశంలో నిద్రపోయాడు. దీంతో ఆ సమావేశంలో కిమ్ చేసిన సూచనలు అమలు చేయలేదు. దీంతో అతనిని యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్ తో కాల్చి చంపించాడు. కిమ్ దగ్గరి బంధువైన జనరల్ జాంగ్ సాంగ్ తనపై వ్యతిరేకతను ఎగదోస్తున్నాడని భావించి, మరణశిక్ష విధించి హతమార్చాడు. ఆయన వారసులను కూడా శిక్షించాడు. ఇక ఆయన భార్య తన భర్తను కిమ్ హత్య చేశాడని ఆరోపించడంతో విషప్రయోగంతో ఆమెను హతమార్చాడు. చైనా పారిపోయి తలదాచుకున్న సవతి సోదరుడు కిమ్ జాంగ్ నామ్ ను మలేషియా రాజధాని కౌలాలంపూర్ విమానాశ్రయంలో విషప్రయోగంతో మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ హత్యకు నాలుగు రోజుల ముందు నామ్ అమెరికా ఏజెంట్ ను కలిశాడు. దీంతో అతనిని హతమార్చాడు.