google assistant: గూగుల్ అసిస్టెంట్... ఇప్పుడు హిందీలో కూడా!
- లాంగ్వేజ్ సెట్టింగ్స్ మార్చుకుంటే చాలు
- ప్రస్తుతానికి హిందీ ప్రశ్నలకు ఇంగ్లిష్‌లో సమాధానం
- త్వరలో హిందీలో సమాధానం ఇవ్వనున్న గూగుల్
గూగుల్ అసిస్టెంట్... ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్న వారందరికీ దీని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కరలేదు. వాయిస్ ఆదేశాల ద్వారా కావాల్సిన పనులు చేసిపెట్టే గూగుల్ అసిస్టెంట్ వాడకం దేశంలో ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. భారత ప్రజలకు దీన్ని మరింత చేరువ చేసేందుకు గూగుల్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇంగ్లిష్ రాని వాళ్లు కూడా దీన్ని ఉపయోగించుకునే ఉద్దేశంతో ప్రాంతీయ భాషలకు గూగుల్ అసిస్టెంట్‌ని అప్‌గ్రేడ్ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు గూగుల్ అసిస్టెంట్‌కి హిందీ భాషను జతచేసింది.
అవును... ఇక గూగుల్ అసిస్టెంట్‌ను హిందీలో ప్రశ్నలు అడగొచ్చు. కానీ ప్రస్తుతానికి సమాధానాలు మాత్రం ఇంగ్లిష్‌లోనే వినాల్సి ఉంటుంది. త్వరలో సమాధానాలు కూడా హిందీలో ఇచ్చేలా గూగుల్ అసిస్టెంట్‌ని అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవడం కోసం లాంగ్వేజ్ సెట్టింగ్స్‌ని మార్చుకుంటే సరిపోతుంది. ఇందుకోసం సెట్టింగ్స్‌కి వెళ్లి అక్కడ లాంగ్వేజ్ అండ్ ఇన్‌పుట్స్‌లో లాంగ్వేజ్ ఆప్షన్‌ని ఎంచుకోవాలి. అక్కడ భాషను ఇంగ్లిష్ (ఇండియా)కి మార్చుకోవాలి. అయితే ఈ ఆప్షన్ ఇంకా పూర్తిస్థాయిలో అప్‌డేట్ కాకపోవడం వల్ల కొన్నింటికి మాత్రమే స్పందించగలుగుతోంది.