budget: రేపటి బడ్జెట్ విషయాలు హిందీలో వెల్లడించనున్న ఆర్థిక మంత్రి
- తొలిసారి హిందీలో బడ్జెట్
- తొలిసారి ప్రవేశపెట్టబోయే ఆర్థికమంత్రిగా అరుణ్ జైట్లీ
- గ్రామీణులకు అర్థమయ్యేలా ఉండేందుకే ఈ ప్రయత్నం
ఇప్పటి వరకు బడ్జెట్‌ను ఇంగ్లిష్ భాషలో ప్రవేశపెట్టేవారు. దీంతో గ్రామీణులు, వ్యవసాయదారులకు దీన్ని అర్థం చేసుకోవడం కొంత ఇబ్బందిగా ఉండేది. దీన్ని అధిగమించడానికి బీజేపీ ప్రభుత్వం ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టబోతోంది. రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హిందీలో చదవనున్నారు. దీంతో హిందీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ఆర్థికమంత్రిగా అరుణ్ జైట్లీ నిలవనున్నారు.
రేపు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కి మరికొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వ చివరి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే. అలాగే వస్తు, సేవల పన్ను అమల్లోకి వచ్చాక ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్‌గా కూడా ఇది నిలవనుంది. 2019లో కూడా అధికారంలోకి రావాలనుకుంటున్న భాజపాకు ఈ బడ్జెట్ ఎంతో కీలకమైంది. ఇప్పటికే ప్రభుత్వం బడ్జెట్‌కు కావాల్సిన సన్నాహాలు పూర్తి చేసింది.