anushka: మూడు భాషల్లో భారీ వసూళ్లు .. 50 కోట్ల క్లబ్ లోకి 'భాగమతి'
- జనవరి 26న విడుదలైన 'భాగమతి'
- తెలుగుతో పాటు తమిళ ..మలయాళ భాషల్లో జోరు
- కథ .. కథనాలు .. అనుష్క క్రేజ్ కారణం
కథానాయిక ప్రాధాన్యత కలిగిన కంటెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం అనుష్కకి అలవాటే. ఆమె ప్రధాన పాత్రను పోషించిన చిత్రాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఆ సినిమాల జాబితాలో తాజాగా 'భాగమతి' కూడా చేరిపోయింది. జనవరి 26వ తేదీన విడుదలైన ఈ సినిమా, అన్ని ప్రాంతాల నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ ను రాబట్టింది.
తెలుగుతో పాటు తమిళ .. మలయాళ భాషల్లోను .. ఓవర్సీస్ లోను కలుపుకుని, తొలివారంతంలో ఈ సినిమా 36 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసిందని చెబుతున్నారు. వీకెండ్ తరువాత కూడా ఈ సినిమా వసూళ్ల పరంగా అదే జోరును కంటిన్యూ చేస్తుండటం విశేషం. తెలుగు .. తమిళ.. మలయాళ .. ఓవర్సీస్ వసూళ్లను కలుపుకుంటే, తొలివారం ముగిసేనాటికీ ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కథ .. కథనాలు .. వాటికి తగిన గ్రాఫిక్స్ .. అనుష్కకి గల క్రేజ్ ఇందుకు కారణమని అంటున్నారు.