President Of India: భారీగా పెరిగిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి జీతాలు
- మూడు రెట్లు పెరిగిన రాష్ట్రపతి జీతం
- రెండున్నర రెట్లు పెరిగిన ఉపరాష్ట్రపతి జీతం
- పెరగనున్న ఎంపీల జీతాలు
కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, గవర్నర్ల జీతాలను పెంచినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఈ మేరకు స్పష్టమైన ప్రకటన చేసిన అరుణ్ జైట్లీ... కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కొత్త పేస్కేల్ ప్రకారం రాష్ట్రపతికి 5 లక్షల రూపాయల వేతనం అందనుంది. ఇప్పటివరకు ఇది 1.50 లక్షల రూపాయలుగా వుంది.
ఉపరాష్ట్రపతి ప్రస్తుతం 1.25 లక్షల రూపాయల వేతనం అందుకుంటుండగా, ఇకపై 4.5 లక్షల రూపాయల వేతనం లభించనుందని తెలిపారు. రాష్ట్రాల గవర్నర్లకు 3.5 లక్షల రూపాయల వేతనంగా నిర్ణయించినట్లు తెలిపారు. వీరితో పాటు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రతి ఐదేళ్లకోసారి ఎంపీల జీతాలు పెరగనున్నట్టు జైట్లీ వెల్లడించారు.