budget: కేంద్ర బడ్జెట్ తో నష్టపోయింది ఎవరు?

  • కస్టమ్స్ డ్యూటీ పెంచడంతో మొబైల్ కంపెనీలకు దెబ్బ
  • బీమా, మ్యూచువల్ ఫండ్స్ కంపీనీలకు కూడా నష్టమే
  • డీలా పడ్డ రక్షణ సంస్థలు

2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేడు లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రైతాంగం, వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలపై ఎక్కువగా బడ్జెట్ ఫోకస్ ఉండటంతో... పలు రంగాలపై దాని ప్రభావం ఉండబోతోంది. అవేంటో ఓసారి చూద్దాం.

యాపిల్, శాంసంగ్:
దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించే దిశగా జైట్లీ బడ్జెట్.
మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ డ్యూటీ 15 శాతం నుంచి 20 శాతానికి పెంపు.
యాపిల్, శాంసంగ్ లాంటి విదేశీ మొబైల్ కంపెనీలకు పెద్ద దెబ్బ.
ఎక్కువ బిజినెస్ జరుగుతున్న మన దేశంలో లాభాలు రావాలంటే... ఇక్కడే తయారీ యూనిట్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

ఫైనాన్స్ రంగం:
ఈక్విటీ ఇన్వెస్ట్ మెంట్లలో దీర్ఘకాల పెట్టుబడులపై వచ్చే లాభాలపై పన్నులు విధించాలని తీసుకున్న నిర్ణయంతో... ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలు, లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు షాక్.
రిలయన్స్ క్యాపిటల్, ఆదిత్యా బిర్లా క్యాపిటల్ లిమిటెడ్, ఐసీఐసీఐ ప్రూడెన్షియల్ లైఫ్ ఇన్స్యూరెన్స్, హెచ్డీఎఫ్సీ స్టాండర్డ్ లైఫ్ ఇన్స్యూరెన్స్, జనరల్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఐడీఎఫ్సీ లిమిటెడ్ లాంటి కంపెనీలకు ఎదురుదెబ్బ.

రక్షణ రంగం:
డిఫెన్స్ కు సంబంధించి ఇండస్ట్రీ-ఫ్రెండ్లీ పాలసీని తీసుకొస్తామని ఇంతకు ముందు ప్రకటించిన జైట్లీ... పార్లమెంటులో దాని గురించి ప్రస్తావించారు. అయినప్పటికీ, రక్షణ రంగానికి సంబంధించి భారీ ఖర్చులు బడ్జెట్ లో లేకపోవడం గమనించదగ్గ అంశం. దీంతో, భారత్ ఫోర్జ్ లాంటి కంపెనీలకు ఈ బడ్జెట్ ద్వారా ఎలాంటి మద్దతు లభించలేదు.

వినియోగదారులు:
కోట్లాది మంది పేదలకు లబ్దిని చేకూర్చే హెల్త్ ప్లాన్ ను ప్రకటించడం సంతోషదాయకమే. అయితే, వీటిపై ఆరోగ్య, విద్య సెస్ ను 3 శాతం నుంచి 4 శాతానికి పెంచడం గమనార్హం. దీంతో, వీటికి సంబంధించిన ఉత్పత్తులు, సేవల ధరలు స్పల్పంగా పెరిగే అవకాశం ఉంది. అంతిమంగా ఇది వినియోగదారులకు భారమే.

  • Loading...

More Telugu News