Andhra Pradesh: రేపటి నుంచి నవ్యాంధ్రలో నంది నాటకోత్సవాలు!
- రేపటి నుంచి 12వ తేదీ వరకు నాటకోత్సవాలు
- తెనాలి, కాకినాడ, రాజమహేంద్రవరం, నంద్యాల, కర్నూలు వేదికగా ఉత్సవాలు
- ఏప్రిల్ 16న బహుమతి ప్రదానం
ఏపీలో నంది నాటకోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఏపీలోని ఐదు ప్రాంతాల్లో వినూత్నంగా ఈ నాటకోత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. తెనాలి, కాకినాడ, రాజమహేంద్రవరం, నంద్యాల, కర్నూలులో ఈ నాటకోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఏపీ టెలివిజన్ చలనచిత్ర అభివృద్ధి సంస్థల ఎండీ వెంకటేశ్వరరావు తెలిపారు.
ఈ నెల 2 నుంచి 12 వరకు నంది నాటకోత్సవాలు జరుగుతాయని, తెనాలిలో మాత్రం 2 నుంచి 10వ తేదీ వరకే నిర్వహిస్తున్నట్టు చెప్పారు. నంది నాటకోత్సవాల్లో గెలుపొందిన కళాకారులకు తెలుగు నాటక రంగ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 16న బహుమతి ప్రదానం చేస్తామని అన్నారు. ఈ పురస్కారాలను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అందజేస్తామని తెలిపారు. నంది నాటకోత్సవాలను ఐదు చోట్ల నిర్వహించనుండటంపై వారు స్పందిస్తూ, ప్రజల వద్దకే వేడుకలను తీసుకెళ్లేందుకు ఇలా నిర్వహించనున్నట్టు చెప్పారు.