mehmood ali: ఛాతీ నొప్పితో కుప్పకూలిన ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ.. ఆసుపత్రికి తరలింపు
- అపోలో ఆసుపత్రిలో చేర్పించిన కుటుంబ సభ్యులు
- రక్తనాళాలు మూసుకుపోయినట్టు గుర్తించిన వైద్యులు
- నాలుగు రోజుల తర్వాత డిశ్చార్జ్
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. రాత్రి 8 గంటల సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని చెబుతూ ఒక్కసారిగా కుప్పకూలారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈసీజీ, యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించిన వైద్యులు ప్రమాదం ఏమీ లేదని తెలిపారు.
గుండె సమస్యలు లేవని వైద్యులు చెప్పినప్పటికీ గుండె రక్తనాళాలు రెండు మూసుకుపోయినట్టు గుర్తించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి సేవలు అందిస్తున్నారు. డిప్యూటీ సీఎం ఆరోగ్యం నిలకడగానే ఉందని, నాలుగు రోజుల తర్వాత డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు. అలీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు చెప్పారు.