kadiyam Srihari: తలపై 'బంగారం' మోసుకుంటూ వచ్చి వన దేవతలకు మొక్కులు చెల్లించుకున్న వెంకయ్యనాయుడు
- గిరిజనుల కొంగు బంగారం సమ్మక్క
- నిలువెత్తు బంగారాన్ని సమర్పించిన వెంకయ్య
- స్వాగతం పలికిన కడియం శ్రీహరి
తెలంగాణ ప్రజల కొంగు బంగారమైన వన దేవతలు సమ్మక్క, సారక్కల గద్దెలను కొద్దిసేపటి క్రితం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. హెలికాప్టర్ లో మేడారానికి వచ్చిన ఆయన, తలపై బంగారాన్ని (బెల్లం) మోసుకుంటూ వచ్చి తన మొక్కులను చెల్లించుకున్నారు. అంతకుముందు నిలువెత్తు బంగారాన్ని ఆయన అమ్మవార్లకు సమర్పించారు.
వెంకయ్యకు ఉప రాష్ట్రపతి కడియం శ్రీహరి స్వాగతం పలికారు. ఆపై మీడియాతో మాట్లాడుతూ, ఇక్కడకు రావడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని, ఆదివాసీ, గిరిజన కుంభమేళాగా సమ్మక్క, సారలమ్మ జాతరను భావించవచ్చని అన్నారు. కాగా, నేడు మధ్యాహ్నం తరువాత మేడారంకు రానున్న కేసీఆర్, వనదేవతలను దర్శించుకుని, నిలువెత్తు బంగారాన్ని తల్లులకు సమర్పించనున్నారు.