Venkaiah Naidu: తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క, సారలమ్మ దేవతలకు మొక్కులు చెల్లించుకున్న వెంకయ్యనాయుడు.. చిత్ర మాలిక!
- తెలంగాణ కుంభమేళాగా సమ్మక్క-సారక్క జాతర
- నిలువెత్తు బంగారాన్ని సమర్పించిన వెంకయ్య
- గిరిజన సాంస్కృతిక, త్యాగం, ధైర్యాన్ని తలుచుకునే అపూర్వ సందర్భం
తెలంగాణ కుంభమేళా అని పిలవబడే సమ్మక్క-సారక్క వన దేవతలను కొద్దిసేపటి క్రితం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. ఈ ఉత్సవం గిరిజన సాంస్కృతిక, త్యాగం, ధైర్యాన్ని తలుచుకునే అపూర్వ సందర్భం అని, కాకతీయుల కత్తికి ఎదురు నిలిచిన ధీరవనితలు గద్దెమీద కొలువై పూజలందుకునే అపూర్వ సందర్భం అని పేర్కొన్నారు. కాగా ఆయన తలపై బంగారాన్ని (బెల్లం) మోసుకుంటూ వచ్చి తన మొక్కులను చెల్లించుకున్నారు.
ఇందుకు సంబంధించిన చిత్రాలు..