sensex: ఎల్టీసీజీ ట్యాక్స్ దెబ్బకు కుప్పకూలిన మార్కెట్లు.. సెన్సెక్స్ 839 పాయింట్ల పతనం
- ఎల్టీసీజీ ట్యాక్స్ విధించాలని ప్రతిపాదించిన జైట్లీ
- ఇన్వెస్టర్లపై తీవ్ర ప్రభావం
- నిఫ్టీ 256 పాయింట్లు పతనం
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ దెబ్బకు భారతీయ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటిరోజే పాతాళానికి పడిపోయాయి. ఈక్విటీల్లో దీర్ఘకాలిక పెట్టుబడులపై వచ్చే లాభాలు రూ. 1 లక్ష దాటితే 10 శాతం ఎల్టీసీజీ ట్యాక్స్ విధించాలన్న జైట్లీ ప్రతిపాదన మార్కెట్లపై నెగెటివ్ ప్రభావాన్ని చూపింది. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బ తీసింది. దీంతో, పెట్టుబడిదారులు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 839 పాయింట్లు పతనమై 35,067 వద్ద ముగిసింది. నిఫ్టీ 256 పాయింట్లు కోల్పోయి 10,761కి పడిపోయింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (1.87%), షాపర్స్ స్టాప్ (1.84%), గుజరాత్ పిపావావ్ పోర్ట్ (1.48%), ఇన్ఫో ఎడ్జ్ (1.20%), టెక్ మహీంద్రా (1.05%).
టాప్ లూజర్స్:
పీసీ జెవెలర్స్ (-24.40%), జీఎంఆర్ ఇన్ఫ్రా (-15.38%), బాంబే డయింగ్ (-13.41%), జిందాల్ సా లిమిటెడ్ (-13.23%), రిలయన్స్ నావల్ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (-12.59%).